IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్-భారత్ మధ్య వన్డే మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక మార్పు చేసింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన జట్టుతోనే టీమిండియా మళ్లీ బరిలోకి దిగబోతున్నది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానున్నది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఐసీసీ ఈవెంట్లో సెమీస్‌కు మరింత దగ్గరవుతుంది. అయితే, విజయం సాధిస్తేనే పాక్‌కు సెమీస్‌కు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో దాంతో ఇరుజట్లకు మ్యాచ్ కీలకంగా మారింది.
ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి రేసులో ఉండాలని పాక్ కృతనిశ్చయంతో ఉన్నది. ఇక బంగ్లాదేశ్‌పై భారత్ భారీ విజయం సాధించిన రోహిత్ సేన.. దాయాదిపై సైతం విజయం నమోదు గెలవాలన్న కసితో ఉన్నది. అయితే, ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్ పైచేయి కావడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. దుబాయిలో భారత్‌కు మంచి రికార్డు ఉన్నది. పాక్‌తో టీమిండియా దుబాయిలో రెండు వన్డే మ్యాచులలో గెలిచింది. ఇక భారత్-పాక్ జట్లు చివరగా వన్డే ఫార్మాట్లో 2023లో తలపడ్డాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.
ఆ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కేవలం 42.5 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఆ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం మాత్రం 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత టీమిండియా 30.3 ఓవర్లలోనే ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇప్పటివరకు రెండు జట్లు వన్డేల్లో 135 సార్లు తలపడ్డాయి. భారత్ 57 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 73 మ్యాచుల్లో గెలిచింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అయితే, తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువగా గెలిచింది. రెండు జట్ల మధ్య 77 వన్డే మ్యాచ్‌లు ఇతర వేదికల్లో జరిగాయి. భారతదేశం 34 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 40 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ.
పాక్ జట్టు : ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్-కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.