టీ20 ప్రపంచకప్లో భారత జట్టు తన తొలి పోరులో దాయాది దేశం పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ నెల 23న జరిగే ఈ మ్యాచ్లో కనుక భారత్ గెలిస్తే.. ప్రపంచకప్ కూడా గెలుస్తుందని టీమిండియా మాజీ స్టార్ సురేశ్ రైనా అన్నాడు. బుమ్రా స్థానంలో షమీని ఎంపిక చేయడాన్ని కూడా రైనా కొనియాడాడు.
‘ప్రస్తుతానికి జట్టు చాలా బాగా ఆడుతోంది. బుమ్రా స్థానాన్ని షమీ భర్తీ చేస్తున్నాడు. దీని వల్ల జట్టుకు కావలసిన ఎక్స్ ఫ్యాక్టర్ దొరుకుతుంది, అర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. కోహ్లీ కూడా ఫామ్ అందుకున్నాడు. అందుకే చెప్తున్నా పాకిస్తాన్ను భారత్ ఓడించగలిగితే కచ్చితంగా కప్ కొడుతుంది’ అని రైనా వివరించాడు.