IND vs NZ : భారత్ (India), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ (Final Match) ప్రారంభం కానుంది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium) లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి క్రికెట్ ప్రేమికులు పోటెత్తారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకుంటున్నారు. పలువురు టీమిండియా జెర్సీలు ధరించి మరీ స్టేడియానికి వస్తున్నారు. ఫ్యాన్స్ తాకిడితో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది.
ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌దేనని టీమిండియా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని పైకెత్తుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు భారత్ గెలువాలని పూజలు చేస్తున్నారు. మరికొందరు ఏసు ప్రభువుకు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | #ICCChampionsTrophy | Team India fans arrive at Dubai International Cricket Stadium for #INDvsNZ final clash.
Unbeaten India is set to take on New Zealand in Dubai today. In the semifinals, India secured their place in the final with a four-wicket win over Australia. pic.twitter.com/SdvHFh5b3k
— ANI (@ANI) March 9, 2025
#WATCH | A team India fan says, ” I am very emotional…this time Rohit Sharma will lift the trophy definitely.” pic.twitter.com/U6QmOtmrsW
— ANI (@ANI) March 9, 2025
#WATCH | Shantipriya Goyal, a team India fan, says, ” I am very excited. I had goosebumps when we won the World Cup in Barbados. Today, I am feeling the same…we need to win Champions Trophy today…” pic.twitter.com/WdMYQuBlMR
— ANI (@ANI) March 9, 2025
#WATCH | #ICCChampionsTrophy | Delhi: Prayers are being offered for team India’s victory in the #INDvsNZ final clash, which is scheduled to be held at Dubai International Cricket Stadium. pic.twitter.com/VSPKGMl4rE
— ANI (@ANI) March 9, 2025
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ నుంచి టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.