ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టును ఎడంచేతి వాటం బ్యాటర్లు ఆదుకున్నారు. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశ పరచడంతో కేవలం 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (102 నాటౌట్) మరోసారి టెస్టు క్రికెట్లో తన ప్రత్యేకత ఏంటో నిరూపించాడు. అతనికి పూర్తిగా సహకరించిన జడేజా (51 నాటౌట్) కూడా చక్కని టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాచ్‌పై నెమ్మదిగా భారత్ పట్టుబిగిస్తోంది.
ఈ మ్యాచ్ డ్రా అయినా సరే సిరీస్ భారత్‌కే దక్కనున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అంత మంచిది. ఒక వైపు ఇంగ్లండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉంటే, టీమిండియా ఆటగాళ్లు ఫామ్‌లేమితో కష్టాలు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లండ్‌ను ఓడించకున్నా.. కనీసం మ్యాచ్ డ్రా చేసుకోవడానికైనా వీళ్లి ఇన్నింగ్స్‌లు కీలకంగా మారతాయని నిపుణులు చెప్తున్నారు.