IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్ ఆడనున్నది. ఈ సిరీస్ జూన్ 24 నుంచి మొదలవనున్నది. భారత అండర్-19 జట్టు కమాండ్ బాధ్యతలను చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్ యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. అదే సమయంలో 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి సైతం జట్టులో చోటు దక్కింది. ఈ సీజన్ ఐపీఎల్లో వారిద్దరూ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ ప్రెస్‌నోట్ విడుదల చేసింది.
జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ పర్యటనలో 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్, ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఇంగ్లాండ్ అండర్-19తో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొంది. మాత్రేకు కెప్టెన్‌గా అవకాశం కల్పించగా.. ముంబయి వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అభిజ్ఞాన్ కుందును వైస్‌కెప్టెన్‌గా నియమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్‌తో తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశికి సైతం చోటు కల్పించింది. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గత నెలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
ఇది ఈ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. సూర్యవంశి బీహార్ తరపున ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఆరు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. కానీ, వాటిలో ఏ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయలేదు. గత సంవత్సరం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన తొలి యూత్ టెస్ట్‌లో వైభవ్ సెంచరీ చేశాడు. 17 ఏళ్ల మాత్రే తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 962 పరుగులు చేశాడు. ఈ సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి నిలిచాడు. కేరళ లెగ్ స్పిన్నర్ మహ్మద్ అన్నన్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. అన్నన్ గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. అన్నన్ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండు యూత్ టెస్ట్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఆ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పంజాబ్ ఆఫ్ స్పిన్నర్ అన్మోల్జిత్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుండు (వైస్ కెప్టెన్ -వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జిత్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్స్ : నమన్ పుష్పక్, డీ దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్ కీపర్).
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
India U19 squad for Tour of England announced.
Details 🔽
— BCCI (@BCCI) May 22, 2025