Gambhir-Hardik | కోల్‌కతా (Kolkata) వేదికగా ఇంగ్లాండ్ (England)తో టీమిండియా ఈ నెల 22న తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఆల్ రౌండర్ హార్దిక్ ప్యాండా (Hardik Pandya) దాదాపు గంటసేపు ఇద్దరూ మాట్లాడుతూ కనిపించారు. ఇద్దరూ నెట్స్‌కు దూరంగా సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పేరును హెడ్‌కోచ్ గంభీర్ (Gautam Gambhir) సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే ఇద్దరు మాట్లాడుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, వన్డే జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు టీమ్ మేనేజ్మెంట్ అప్పగించింది.
చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సెలక్షన్ కమిటీ దాదాపు మూడు గంటల పాటు సమావేశమైంది. భేటీలో జట్టు విషయంలో సెలెక్టర్ల మధ్య ఏ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదని ప్రచారం జరిగింది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతేడాది సూర్యకుమార్ యాదవ్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సంజు సామ్సన్తో కూడా గంభీర్ మాట్లాడడం కనిపించింది. టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్‌గా ఎంపికైన శాంసన్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక దాదాపు ఖాయమైందని.. కోచ్ గంభీర్ సైతం అతని వైపు మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి.
Today Gautam Gambhir talked with Hardik Pandya for 30-35 minutes approx & with Samson around 40 minutes alone in private personal space.
Gambhir yesterday in selection meeting wanted Hardik as vice captain & Samson as back up wicket keeper. pic.twitter.com/0F0XYapRfp
— Rajiv (@Rajiv1841) January 19, 2025