Jos Buttler | విదేశీ పర్యటనల సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ అవసరమని.. మానసిక, భావోద్వేగ సమయాల్లో వారి మద్దతు నుంచి అందుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఇటీవల బీసీసీఐ ఇటీవల కొత్త పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భారత్-ఇంగ్లాండ్ మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో జోస్ బట్లర్ మాట్లాడాడు. ఆధునిక యుగంలో విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో కుటుంబం ఉండడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బట్లర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లతో భార్య, పిల్లు ఉండడం భావోద్వేగంగా సోపర్ట్ ఉంటుందని.. కఠినమైన షెడ్యూల్ సమయంలో వారి మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందన్నారు. ప్రస్తుత కాలంలో చాలా క్రికెట్ ఆడుతున్నారని.. ఆటగాళ్లు ఇంటి వెలుపలే చాలా సమయం గడుపుతున్నారన్నారు.
కుటుంబంతో కలిసి ఉండడం ఆటలో పెద్దగా తేడాలుండవని తాను అనుకోనని చెప్పాడు. కుటుంబం ఉండడం వృత్తిపరమైన కట్టుబాట్లకు ఆటంకం కలిగించదని బట్లర్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబంతో కలిసి ఉండడం ద్వారా ఇంటికి దూరంగా ఉండడంతో కలిగే భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తున్నానని చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం తర్వాత టీమిండియాపై బీసీసీఐ కొరఢా ఝుళిపించింది. పది పాయింట్స్ కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులకు గతంలో మాదిరిగా అవకాశం ఉండదు. 45 రోజుల కంటే ఎక్కువ రోజులు సాగే విదేశీ పర్యటనలో మాత్రమే ఆటగాళ్ల కుటుంబానికి రెండు వారాలు అనుమతి ఇస్తారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొత్త రూల్‌పై తన అభిప్రాయం వెల్లడించాడు. బీసీసీఐ కొన్ని మార్పులు అవసరమని గ్రహించిందని.. జట్టులో ఐక్యతను పెంచేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తుందని తెలిపాడు.
Rohan Bopanna: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్.. క్వార్టర్స్‌లో ఓడిన బొప్పన్న జోడి
Virat Kohli | ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..! రంజీ ట్రోఫీలో ఆడనున్న విరాట్ కోహ్లీ..!