మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ నుంచి బొపన్న(Rohan Bopanna) జోడి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో రోహన్ బొపన్న- షుయ్ జాంగ్ జోడి తీవ్రంగా పోరాడినా.. 6-2 4-6 9-11 స్కోరు తేడాతో వైల్డ్ కార్డు ప్లేయర్లు జాన్ పీర్స్-ఒలివియా గాడెక్కి జోడి చేతిలో ఓటమి పాలయ్యారు. కియా ఎరినాలో సుమారు గంటా 8 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత ఆటగాళ్ల ప్రాతినిధ్యం ముగిసింది. మెన్స్ డబుల్స్ నుంచి కూడా బొపన్న నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ ప్లేయర్లు సుమిత్ నాగల్, డబుల్స్ స్పెషలిస్టు యుకి బాంబ్రి, ఎన్న శ్రీరాం బాలాజీ కూడా ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగారు. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో బొపన్న-జాంగ్ జోడి.. తొలి సెట్‌ను కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డు జోడిపై ఈజీగా ఆ సెట్‌ను గెలుచుకున్నది. కానీ సెకండ్ సెట్లో చైనీస్ క్రీడాకారిణి తన సర్వ్‌ను కోల్పోవడంతో.. ప్రత్యర్థులు బలం పుంజుకున్నారు. రెండో సెట్‌ను 4-6 తేడాతో ఆసీస్ జోడి గెలిచింది.
THROUGH TO THE SEMIFINALS 🟢🟡
Olivia Gadecki and John Peers defeat Rohan Bopanna and Shuai Zhang to secure a spot in the semifinals of the mixed doubles.#AO2025 pic.twitter.com/IJrOQpP6Ia
— TennisAustralia (@TennisAustralia) January 21, 2025
ఇక మూడవ సెట్ ఆసక్తికరంగా సాగింది. సూపర్ టైబ్రేకర్ లో రెండు టీంలు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. సూపర్ టై బ్రేకర్‌లో మొదటి సర్వ్‌ను బొపన్న, జాంగ్ కోల్పయాయి. ఓ దశలో 3-3కు చేరుకున్నది. మళ్లీ ఓ దశలో ఆసీస్ 7-5 ఆధిక్యాన్ని అందుకున్నది. కానీ 8-8 వద్ద బొపన్న జోడికి మ్యాచ్ పాయింట్ అవకాశం ఉన్నా.. పీర్స్ దాన్ని అడ్డుకున్నాడు.