Vaishnavi Sharma | వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ వైష్ణవి శర్మ చరిత్ర సృష్టించింది. మలేషియాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లు వైష్ణవి అత్యద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసిన వైష్ణవి ఐదు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఓ మెయిడెన్ ఓవర్ ఉండడం విశేషం. మ్యాచ్ 14వ ఓవర్లలో వరుసగా మూడు వికెట్ల పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేసింది. 14వ ఓవర్లో వైష్ణవి రెండో బంతికి నూర్ ఎన్ బింటి రోస్లాన్ (3)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది. ఆ తర్వాతి బంతికి నూర్ ఇస్మా డానియా (0)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి పెవిలియన్‌కు పంపించింది. ఆ తర్వాత అదే ఓవర్లో నాలుగో బంతికి సితి నజ్వా (0) అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా.. మొత్తంగా మూడో బౌలర్‌గా వైష్ణవి రికార్డులకెక్కింది. ఈ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది.
వైష్ణవి బాల్‌తో రాణించడంతో మలేషియాపై భారత్ పది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అండర్-19 వరల్డ్ కప్‌లో ఇది భారత్‌కు వరుసగా రెండో విజయం. ఇంతకు ముందు వెస్టిండీస్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వైష్ణవి, ఆయుషి శుక్లా ధాటికి మలేషియా జట్టు 14.3 ఓవర్లలోనే 31 పరుగులకు కుప్పకూలింది. మలేషియా ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయారు. వికెట్ కీపర్ నూర్ అలియా హైరున్, హుస్నా చెరో ఐదు పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. వైష్ణవి నాలుగు ఐదు వికెట్లు తీయగా.. ఆయుషి శుక్లాకు మూడు వికెట్లు దక్కాయి. జోషిత వీజే ఒక వికెట్ తీసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 2.5 ఓవర్లలో 32 పరుగులు చేసింది. ఓపెనర్ జీ త్రిసా 27 పరుగులతే అజేయంగా నిలువగా.. జీ కమలిని నాలుగు పరుగులు చేసింది.
𝕎 𝕎 𝕎#TeamIndia‘s left arm spinner & debutant Vaishnavi Sharma becomes the first Indian bowler to pick up a hattrick in #U19WomensWorldCup tournament! 🙌🏻#U19WomensT20WConJioStar 👉 #INDWvMASW, LIVE NOW on Disney+ Hotstar! pic.twitter.com/DaEdFnus07
— Star Sports (@StarSportsIndia) January 21, 2025