బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 13, 2020 , 00:30:39

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

వరంగల్‌ స్పోర్ట్స్‌:  సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నీని బుధవారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా టోర్నీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి టోర్నీలకు ఆతిథ్యమిచ్చే విధంగా స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈనెల 17 వరకు జరిగే టోర్నీలో 32 జట్లు పాల్గొంటున్నట్లు  నిర్వహణ కమిటీ కన్వీనర్‌ ఉదయ్‌ భానురావు వెల్లడించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న ఐలయ్య, కార్పొరేటర్లు విజయ్‌భాస్కర్‌, రమేష్‌, శ్రీనివాస్‌, డిన్న, గణేష్‌ పాల్గొన్నారు.


logo