న్యూఢిల్లీ : చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మోహిసిన్ నక్వితో ఐసీసీ చైర్మన్ జై షా చర్చలు జరిపే అవకాశముంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో వెళ్లేందుకు ససేమిరా అంటున్న భారత్..తటస్థ వేదికపై ఆడేందుకు సై అంటున్నది.చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్ ఉంటుందా అన్నది తేలనుంది.