ఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైని బోర్డు ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీసీసీఐ.. ఐసీసీకి తుది నివేదిక అందజేసినట్టు వినికిడి.
శ్రీలంకలోనూ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా క్యాండీ, కొలంబో దాదాపు ఖాయమవగా మూడో వేదికను త్వరలోనే ఫైనల్ చేసే అవకాశముంది. పాకిస్థాన్ ఫైనల్ చేరితే (శ్రీలంకలో) తప్ప టైటిల్ పోరుకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుండటం లాంఛనమే! వచ్చే వారం ఐసీసీ వేదికలను అధికారికంగా ప్రకటించనుంది.