ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా కీలక నిర్ణయాలను ప్రకటిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో స్టాప్ క్లాక్ (Stop Clock)ను ప్రవేశ పెట్టిన ఐసీసీ టీ20లపై కూడా నజర్ వేసింది. పరిస్థితులకు తగ్గట్లు పొట్టి క్రికెట్లో మార్పులు అనివార్యం అని భావించిన మండలి.. పవర్ ప్లే (Power Play)లో కొన్ని కీలక సవరణలు చేసింది. ప్రస్తుతానికి తొలి ఆరు ఓవర్లను పవర్ ప్లేగా పరిగణిస్తున్నారు. అయితే.. వర్షం కారణంగా ఓవర్లు కుదించాల్సి వస్తే.. పవర్ ప్లేలో ఎన్ని ఓవర్లు ఆడించాలి? అనే విషయంపై మాత్రం సందిగ్దం కొనసాగేది. దాంతో, గురువారం ఐసీసీ ఈ అంశంపై స్పష్టతనిచ్చింది.
టీ20లు అంటే ఇరవై ఓవర్ల ఆట. అందులో 30శాతం ఓవర్లు అంటే అరు ఓవర్లను పవర్ ప్లేగా పేర్కొంటారు. కానీ, వర్షం కారణంగా కొన్నిసార్లు 15, 10 లేదంటే 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటప్పుడు పవర్ ప్లే ఓవర్ల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే.. ఐసీసీ మ్యాచ్ ఓవర్లను బట్టి.. పవర్ ప్లే ఓవర్లను నిర్ణయించింది.
🚨 Breaking 🚨
New Powerplay rule changes by ICC in case of match being reduced to specific overs in T20I cricket.
Earlier it was rounded to nearby over. Now we’ll have it rounded to specific ball.
Example given below 👇 pic.twitter.com/A1VqGQWHTz
— Inside out (@INSIDDE_OUT) June 26, 2025
ఉదాహరణకు 5 ఓవర్ల ఆట సాధ్యమైతే 1.3 ఓవర్ వరకే పవర్ ప్లే వర్తిస్తుంది. అదే 6 ఓవర్లు అనుకోండి.. 1.5 అంటే 11 బంతుల్లోనే పవర్ ప్లే ముగుస్తుంది. 7 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే 2.1 ఓవర్లు పవర్ ప్లే ఆడిస్తారు. అదే 8 ఓవర్ల ఆట వీలుపడితే 2.2 ఓవర్‌తో పవర్ ప్లే పూర్తి అవుతుంది. 9 ఓవర్లకు 2.4, 10 ఓవర్లకు 3 ఓవర్లు, 11 ఓవర్లకు 3.2, 12 ఓవర్లకు 3.4, 13 ఓవర్లకు 3.5, 14 ఓవర్లకు 4.1, 15 ఓవర్లకు 4.3, 16 ఓవర్లకు 4.5, 17 ఓవర్లకు 5.1, 18 ఓవర్లకు 5.2, 19 ఓవర్లకు 5.4 ఓవర్లను పవర్ ప్లేగా నిర్ణయించింది ఐసీసీ.