ICC New Rules 2025 | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలోనే కొత్త రూల్స్‌ను తీసుకురాబోతున్నది. ఇది బౌలర్లకు పండగలాంటి వార్తే. వన్డే క్రికెట్లో గత కొద్ది సంవత్సరాలుగా రెండు బాల్స్ నిబంధన అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రూల్ బౌలర్లకు పెద్దగా అనుకూలంగా లేదని.. బ్యాటర్లకు ఉపకరిస్తుందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో కొత్త నిబంధనతో బౌలర్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక వన్డే ఇన్నింగ్‌లో రెండు వేర్వేరు బాల్స్‌ను ఒక్కో ఎండ్ నుంచి 25 ఓవర్ల చొప్పున బౌలింగ్ వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. జులై నుంచి కొత్తగా ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నది. ఈ రూల్స్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభం నుంచి 34 ఓవర్‌కు రెండు బాల్స్‌ను ఉపయోగిస్తారు. అప్పటి నుంచి ఒక్కో ఎండ్ నుంచి రెండో బాల్స్‌ని ఉపయోగిస్తారు.
Read Also : IPL 2025 | క్వాలిఫయర్-1 గెలిచిన జట్టుకే ఐపీఎల్ టైటిల్ అవకాశాలు..! ఈ సారి ఆర్సీబీకి అనుకూలించేనా..?
అయితే, 35వ ఓవర్ తర్వాత ఫీల్డింగ్ సైడ్ రెండు బాల్స్‌లో ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని.. మిగతా ఓవర్ల వరకు అదే బాల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గతంలో రెండు బాల్స్ వాడటం వల్ల ఒక బంతి చాలా ఎక్కువగా పాతపడకపోవడం వల్ల రివర్స్ స్వింగ్ చాలా అరుదుగా లభిస్తుండేది. కానీ, 35వ ఓవర్లో ఒకే బాల్‌ను కొనసాగించడం వల్ల బంతి పాతపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో చివరి 10 ఓవర్లలో రివర్స్ సింగ్ లభించే అవకాశాలు మరింత పెరుగుతాయి. దాంతో బౌలర్లకు మరింత ప్రయోజనకరంగా ఉండనున్నది. వన్డేల్లో బ్యాట్స్‌మెన్ హవా ఎక్కువగా ఉందని.. బౌలర్లకు ఎలాంటి ప్రయోజనం లేదనే విమర్శలు వచ్చాయి. బాల్‌కు, బ్యాట్‌కు మధ్య పోటీ సమతూకంగా ఉండాలని చూడాలని పలువురు మాజీలు డిమాండ్ చేశారు. తాజాగా ఐసీసీ నవ్డే ఫార్మాట్లో సమతూకం తీసుకువచ్చినట్లవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also : Rinku-Priya Wedding | క్రికెటర్ రింకు సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్..!
పంజాబ్ X ముంబై ..నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2 పోరు