ICC : అమెరికా, వెస్టిండీస్ జంటగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024) బౌలర్ల అడ్డాగా మారింది. పేసర్లు బుల్లెట్ బంతులతో వణికిస్తున్నారు. అందులోనూ న్యూయార్క్‌లో మ్యాచ్ అంటే చాలు పవర్ హిట్టర్లంతా ఆడలేమంటూ చేతులెత్తేస్తున్నారు. అక్కడి నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau County)లో ఊహించని బౌన్స్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెడుతోంది. దాంతో, ఈ పిచ్ చాలా డేంజరస్, ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లకు పనికిరానిది అని మాజీ క్రికెటర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటన చేసింది.
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఉపయోగించిన న్యూయార్క్ పిచ్ అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే.. ప్రపంచస్థాయి క్యురేటర్లు, గ్రౌండ్ సిబ్బంది ఆ పిచ్‌ను మెరుగ్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జరుగబోయే మిగతా మ్యాచ్‌లకు పిచ్ అనుకూలంగా ఉండేలా వాళ్లు కృషి చేస్తున్నారు అని ఐసీసీ తెలిపింది. న్యూయార్క్ స్టేడియంలో ఇప్పటివరకూ అన్నీ లో స్కోరింగ్ మ్యాచ్‌లే జరిగాయి.
JUST IN: ICC release a statement regarding the state of the pitches at Nassau County International Cricket Stadium in New York 🏟️ #T20WorldCup pic.twitter.com/dKx47WZSxZ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 6, 2024
దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జి(4/7) విజృంభణతో శ్రీలంక 77 రన్స్‌కే ఆలౌట్ కాగా.. ఆ చిన్న లక్ష్యాన్ని సఫారీ జట్టు 16 ఓవర్లలో ఛేదించింది. ఇక టీమిండియా, ఐర్లాండ్ మ్యాచ్‌లో అయితే.. బుమ్రా(2/6), హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లు రెచ్చిపోయారు. దాంతో, రోహిత్ సేన ఐరిష్ జట్టును 96 పరుగులకే కట్టడి చేసి.. వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టింది.