ICC : పొట్టి ప్రపంచ కప్ చాంపియన్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. టీ20 వరల్డ్ కప్(T20 World Cup) చరిత్రలోనే ఈసారి విజేతకు రికార్డు స్థాయిలో డబ్బు ఇస్తున్నట్టు సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. అవును.. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్ల నగదు పురస్కారాన్ని ఐసీసీ అందనుంది. 8వ సీజన్ చాంపియన్ ఇంగ్లండ్ అందుకున్న మొత్తానికి కంటే ఈసారి ప్రైజ్‌మనీ రూ. 7 కోట్లు ఎక్కువ కావడం విశేషం.
ట్రోఫీ విన్నర్స్‌కు ఇచ్చే నగదు కానుకను పెంచడంపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అల్లార్డిసే(Goeff Allardice) సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈసారి జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఎన్నో చారిత్రాత్మకమైనది. ట్రోఫీ, ప్రైజ్ మనీ కోసం పలు జట్లు పోటీపడుతున్నాయి. ఈ విశ్వ క్రీడా సంగ్రామం ద్వారా క్రికెటర్ల అద్భుత ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు’ అని అల్లార్డిసే ఓ ప్రకటనలో తెలిపాడు.
ICC reveal historic prize money for the Men’s #T20WorldCup 🤩
Details ⬇️https://t.co/jRhdAaIkmc
— ICC (@ICC) June 3, 2024
ట్రోఫీ విన్నర్‌కే కాకుండా రెండో స్థానంలో నిలిచిన జట్టుకు కూడా ఐసీసీ భారీగానే ప్రైజ్‌మనీ ఇస్తోంది. విజేతకు రూ.20. 36 కోట్లు కాగా.. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.64 కోట్లు ముట్టజెప్పనుంది. ఇక సెమీఫైనల్లో వెనుదిరిగిన జట్లకు తలా రూ. 6 కోట్లు, సూపర్ 8 దశ దాటలేని వాటికి రూ. 3 కోట్లు లభించనున్నాయి. 12, 13వ స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రూ.1.87 కోట్లు అందుకుంటాయి. ఇక టోర్నీలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఒక్కో జట్టు అదనంగా రూ. 25 లక్షలు ఆర్జించనుంది. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై ట్రోఫీ అందుకున్న ఇంగ్లండ్ రూ.13 కోట్లు గెలుచుకుంది.ఇవి కూడా చదవండి