Loksabha Elections 2024 | కాషాయ పార్టీ కనుసన్నల్లో ఎగ్జిట్ పోల్స్ : జితూ పట్వారీ
Loksabha Elections 2024 : బీజేపీ నేతలు చెబుతున్న మాటలనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ అన్నారు.
Loksabha Elections 2024 : బీజేపీ నేతలు చెబుతున్న మాటలనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్నో వ్యత్యాసాలున్నాయని, వీటిలో వాస్తవాలేంటనేది మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయని చెప్పారు.
బీజేపీ నేతలు చెబుతున్న తీరులోనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడికావడమంటే కాషాయ నేతలకు అనుకూలంగా వీటిని ఏమార్చారని అర్ధమవుతున్నదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకునే చోట ఎగ్జిట్ పోల్స్ ఆరు సీట్లు చూపాయని, ఆ పార్టీ మూడు స్ధానాల్లో పోటీ చేసిన చోట ఆరు సీట్లు గెలుస్తుందని చూపారని జితూ పట్వారీ ఆక్షేపించారు. భోపాల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మధ్యప్రదేశ్‌లో తాము అత్యధిక స్దానాల్లో గెలిచే అవకాశాలున్నా తమ అంచనాలకు పూర్తి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలున్నాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో తమ పార్టీ నైతిక స్ధైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 295 స్ధానాలు పైగా గెలుచుకుంటుందని చెప్పారు.
Read More :
Sukumar Sen: తొలి సీఈసీ జీవితకథ ఆధారంగా చిత్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

