Hyderabad | హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జంట నగరాల పరిధిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో, ప్రధాన రహదారులపై బాణాసంచా కాల్చొద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధన జూన్ 4వ తేదీన ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు మంగళవారం మూతపడనున్నాయి. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలు అమలుచేయనున్నారు.