మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 10: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా జరిగిన 68వ ఎన్‌జీఎఫ్ అండర్-19 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ బాలబాలికల జట్లు విజేతగా నిలిచాయి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌తో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 50-23తో విజయం సాధించింది.
బాలుర విభాగంలో 56-28తో రంగారెడ్డిపై గెలిచింది. మహబూబ్‌నగర్ (బాలికలు), రంగారెడ్డి (బాలురు) జట్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ఎన్‌జీఎఫ్ సెక్రటరీ పాపిరెడ్డి, టోర్నీ రాష్ట్ర పరిశీలకుడు గోవర్దన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.