హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ రెండో దశ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఎలైట్ గ్రూపు-డీలో ఉన్న ఈ రెండు జట్లు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు డ్రాలు, ఒక విజయం, ఒక ఓటమితో హైదరాబాద్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంటే.. ముంబై(24) అగ్రస్థానంలో కొనసాగుతున్నది. స్టార్ బ్యాటర్ తిలక్‌వర్మ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగుతుండగా, తన్మయ్, రాహుల్ కీలకం కానున్నారు.