హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ రెండో అంచె పోటీలను హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఇన్నింగ్స్ 43 రన్స్‌తో హిమాచల్ ప్రదేశ్‌ను చిత్తు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేసి ఆలౌట్ అవడంతో ఫాల్ ఆన్ ఆడిన హిమాచల్.. రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు కుప్పకూలింది.
తనయ్ త్యాగరాజన్ (6/118) ఆరు వికెట్లతో చెలరేగగా మొదటి ఇన్నింగ్స్‌లో ఫైఫర్‌తో రాణించిన అనికేత్ రెడ్డి (4/46) మరో అద్భుత ప్రదర్శనతో హిమాచల్‌కు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 565 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం విదితమే.