Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఎదురులేని హైదరాబాద్.. మిజోరాంపై సత్తాచాటిన బౌలర్లు
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఐదో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నది.
Ranji Trophy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఐదో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నది. ప్లేట్ గ్రూప్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన పోరులో మన బౌలర్లు సత్తాచాటడంతో మిజోరాం 199 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ రాయుడు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది.
గత మ్యాచ్ ట్రిపుల్ సెంచరీ హీరో తన్మయ్ అగర్వాల్ (6) త్వరగా పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రాహుల్ సింగ్ (81), రోహిత్ రాయుడు (25) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న హైదరాబాద్ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు అందుకున్న హైదరాబాద్.. ఈ సారి కూడా అదే దిశగా సాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

