ప్రస్తుతం టీమిండియాలో స్టెల్లార్ ఫామ్లో ఉన్న ఆటగాడు సూర్యకుమార్.. తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న అతనిపై జట్టు బాగా ఆధారపడుతోంది. ఈసారి భారత జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశాలు అతనిపైనే ఆధారపడి ఉన్నాయని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, అదే తరహాలో బ్యాటింగ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నానని చెప్పాడు. ‘తను చాలా కాన్ఫిడెన్స్ ఉన్న ఆటగాడు. బెదురు లేకుండా ఆడతాడు. తనకున్న నైపుణ్యాలను అద్భుతంగా ఉపయోగించుకుంటాడు. ఈ టోర్నీలో అతను ఎక్స్-ఫ్యాక్టర్ అవుతాడని ఆశిస్తున్నా’ అని రోహిత్ అన్నాడు. రోహిత్ సేన ఈ నెల 23న ఈ పొట్టి ప్రపంచకప్లో తన తొలి మ్యాచ్లో దాయాది దేశం పాకిస్తాన్తో తలపడనుంది.