NZ vs ZIM : సొంత గడ్డపై చెలరేగి ఆడతారనుకుంటే జింబాబ్వే బ్యాటర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) పేస్ దళాన్ని ఎదుర్కోలేక తమ జట్టును నట్టేట ముంచారు. కివీస్ స్పీడ్‌స్టర్ మ్యాట్ హెన్రీ(6-39) విజృంభణతో రెండంకెల స్కోర్ చేసేందుకు అల్లాడి పోయారు. సహచరులు బ్యాట్లెత్తేసినా కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ (39), వికెట్ కీపర్ తఫజ్వ సిగా(30)లు పోరాడంతో ఆతిథ్య జట్టు 149 పరుగులు చేయగలిగింది.
స్వదేశంలో ఈమధ్యే దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన జింబాబ్వే మరో ఓటమి ప్రమాదంలో పడింది. న్యూజిలాండ్ బౌలర్ల ముందు ఆతిథ్య జట్టు బ్యాటర్లు నిలువలేకపోవడంతో స్వల్ప స్కోర్‌కే ఆలౌటయ్యింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ(6-39) నిప్పులు చెరగడంతో 69కే ఐదు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సారథి క్రెగ్ ఇర్విన్ (39), వికెట్ కీపర్ తఫజ్వ సిగా(30), నిక్ వెల్చ్(27)లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
Matt Henry finishes with 6 wickets as Zimbabwe’s 1st innings comes to a rather early close on Day 1 #ZIMvNZ
Follow here on the ESPNcricinfo app 👉 https://t.co/kt74xB2oJE pic.twitter.com/nhsdiG5oRf
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2025
కానీ, మరో పేసర్ నాథన్ స్మిత్ (3-20) కెప్టెన్ ఇర్విన్, సిగాలను ఔట్ చేసి ఆలౌట్ అంచున నిలిపాడు. చివరి వికెట్‌గా వచ్చిన మజురబని(1)ని ఔట్ చేసిన హెన్రీ జింబాబ్వే ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆతిథ్య జట్టును 149కే కూల్చిన కివీస్ అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు విల్ యంగ్(21 నాటౌట్), డెవాన్ కాన్వే(24 నాటౌట్) బౌండరీలతో చెలరేగడంతో 12 ఓవర్లకే స్కోర్ 45కు చేరింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 104 రన్స్ వెనకబడి ఉంది.