IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఉప్పల్‌లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసిందో లేదో చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే వాన పెద్దదైంది. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు పరుగున డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్నారు. మైదానం సిబ్బంది గబగబా వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు.
చూస్తుంటే.. ఈ వాన కమిన్స్ సేన ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగించేలా ఉంది. అదే జరిగితే.. ఓవర్లు కోల్పోయే ప్రమాదముంది. సో.. చినుకులు ఎప్పుడు తగ్గుతాయోనని.. హైదరాబాద్ హిట్టర్లు స్వల్ప లక్ష్యాన్ని ఎంత త్వరగా ఛేదిస్తారో చూడాలని ఆరెంజ్ ఆర్మీ సహా స్టేడియంలోని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
Innings Break!
A dominant bowling effort from #SRH led by Pat Cummins restricts #DC to 1⃣3⃣3⃣
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers pic.twitter.com/JFGWH7AhjD
— IndianPremierLeague (@IPL) May 5, 2025
సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్లు రెచ్చిపోయారు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నడ్డి విరిచారు. తొలుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3-19) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. ఉనాద్కాట్(1-13) డేంజరస్ కేఎల్ రాహుల్(10)ను ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లో ముంచాడు. 62కే 6 వికెట్లు పడిన వేళ ట్రిస్టన్ స్టబ్స్(41 నాటౌట్) ఇంప్యాక్ట్గా వచ్చిన అశుతోష్ శర్మ(41)లు ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడారు. డెత్ ఓవర్లలో ఈ జోడీ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలు రాబట్టి స్కోర్ 100 దాటించారు. ఏడో వికెట్‌కు 66 రన్స్ జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మలింగ వేసిన 20వ ఓవర్ల్ స్టబ్స్ ఫోర్ బాదగా ఢిల్లీ 133 పరుగులు చేయగలిగింది.