IPL 2025 : సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్లు రెచ్చిపోయారు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నడ్డి విరిచారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3-19) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. ఉనాద్కాట్ డేంజరస్ కేఎల్ రాహుల్(10)ను ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లో ముంచాడు. 62కే 6 వికెట్లు పడిన వేళ ట్రిస్టన్ స్టబ్స్(41 నాటౌట్) ఇంప్యాక్ట్గా వచ్చిన అశుతోష్ శర్మ(41)లు ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడారు. డెత్ ఓవర్లలో ఈ జోడీ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలు రాబట్టి స్కోర్ 100 దాటించారు. ఏడో వికెట్‌కు 66 రన్స్ జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మలింగ వేసిన 20వ ఓవర్ల్ స్టబ్స్ ఫోర్ బాదగా ఢిల్లీ 133 పరుగులు చేయగలిగింది.
ప్లే ఆఫ్స్ రేసుకు ఆమడ దూరంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెలరేగింది. సారథి ప్యాట్ కమిన్స్(3-19) ముందుండి వికెట్ల వేట కొనసాగించగా.. ఢిల్లీని ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. పవర్ ప్లేలో నిప్పులు చెరిగిన ప్యాటీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కరుణ్ నాయర్(0) వికెట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అదిరే బ్రేకిచ్చాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ తొలి బంతికే ఫాఫ్ డూప్లెసిస్(3) ఇన్ స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు. షాక్‌లో ఉండిపోయిన ఢిల్లీని మరింత కష్టాల్లోకి నెడుతూ మూడో ఓవర్ మొదటి బంతికే అభిషేక్ పొరెల్ (8) వికెట్ సాధించాడు సన్‌రైజర్స్ సారథి.
No better way to begin 🫡#SRH skipper Pat Cummins’ ruthless performance rattles #DC‘s top-order 💪
DC are 26/4 at the end of the powerplay.
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers pic.twitter.com/8q3Aruxj5q
— IndianPremierLeague (@IPL) May 5, 2025
అనంతరం ధాటిగా ఆడాలనుకున్న అక్షర్ పటేల్(6)ను హర్షల్ పటేల్ ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.అయితే.. ఆపద్భాందవుడు కేఎల్ రాహుల్(10) ఉన్నాడన్న భరోసాతో ఉన్న ఢిల్లీకి షాకిచ్చాడు ఉనాద్కాట్. అంతే.. 29 వద్ద ఊదో వికెట్ పడింది. యువ ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్(18), ట్రిస్టన్ స్టబ్స్(41 నాటౌట్)లు అక్షర్ బృందాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ అనికేత్ వర్మ విప్రజ్‌ను రనౌట్ చేయడంతో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా అశుతోష్ శర్మ(41) రావాల్సి వచ్చింది.
హైదరాబాద్ బౌలర్ల ధాటికి స్టార్ ఆటగాళ్లు డగౌట్ చేరగా.. కుర్రాళ్లు స్టబ్స్, ఆశుతోష్‌లు నిలబడ్డారు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత జీషన్ అన్సారీ ఓవర్లో అశుతోష్ రెండు స్ట్రెయిట్ సిక్సర్లు బాదాడు. దాంతో, 14 పరుగులు రాగా.. ఢిల్లీ స్కోర్ 80 దాటింది. కమిన్స్ 7 రన్స్ ఇవ్వగా.. హర్షల్ వేసిన 17వ ఓవర్లో శర్మ రెండు బౌండరీలు సాధించాడు. మలింగ వేసిన 18వ ఓవర్లో స్టబ్స్ ఫోర్‌తో వీళ్ల భాగస్వామ్యం హాఫ్ సెంచరీ దాటింది. అనంతరం హర్షల్ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. మలింగ వేసిన 20వ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన అశుతోష్ బౌండరీ వద్ద అభినవ్ చేతికి చిక్కాడు. చివరి బంతికి స్టబ్స్ ఫోర్ కొట్టగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
SMACKED…and again! 🔥
Ashutosh Sharma adding the much-needed fire to #DC‘s innings 💪
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @DelhiCapitals pic.twitter.com/sMA3ZLKotz
— IndianPremierLeague (@IPL) May 5, 2025