Putin India Tour | భారత్‌కు రష్యా అధ్యక్షుడు.. మోదీ ఆహ్వానం మేరకు రానున్న పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భారత పర్యటనకు అంగీకరించారు.
Putin India Tour | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భారత పర్యటనకు అంగీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం పుతిన్ ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ సూచించారు. ఈ సందర్భంగా భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలు అంగీకరించినట్లుగా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో భారత్‌లో భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారతదేశ పర్యటన అవుతుంది. ఇంతకు ముందు ఆయన 2021లో భారత్‌లో పర్యటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

