England Womens Team : ఇంగ్లండ్ మహిళల జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డు సాధించింది. రికార్డు ఛేదనతో వన్డేల్లో చరిత్ర సృష్టించింది. యాషెస్ సిరీస్(Ashes Series)లో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆతిథ్య జట్టు కెప్టెన్ హీథర్‌నైట్(75) అద్భుత హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్ రికార్డు విక్టరీ కొట్టింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో, ఆస్ట్రేలియా చేతిలో హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకుంది. అంతేకాదు సిరీస్‌ను 6-6తో సమం చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. బేత్ మూనీ(81 నాటౌట్) హాఫ్ సెంచరీ, ఎలీసా పెర్రీ(41) చెలరేగడంతో పర్యటక జట్టు ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ టామీ బ్యూమంట్(47) శుభారంభం ఇచ్చింది.
కెప్టెన్ హీథర్‌నైట్(75)

ఆమె ఔటయ్యాక అలిసే క్యాప్సే(40)తో కలిసిన హీథర్ నైట్ జట్టును ఆదుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుడున్నా ఆమె పట్టువిడవలేదు. చివరి దాకా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇరుజట్ల మధ్య జరిగిన యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆసీస్ ఆల్‌రౌండర్ అష్ గార్డ్ సంచలన బౌలింగ్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టింది.