Virat Kohli | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ ఏ దేశానికి వెళ్లినా అతని ఆట చూసేందుకు అభిమానులు స్టేడియాల వద్ద క్యూ కడుతుంటారు. కేవలం అభిమానులే కాదు.. ప్రత్యర్థి దేశాల జట్లలో సైతం ఈ రన్ మెషీన్ కి వీరాభిమానులు ఉన్నారు. విండీస్ వికెట్ కీపర్ జాషువా డాసిల్వా (Joshua Da Silva) తల్లి కూడా విరాట్ కు వీరాభిమాని.
ఎన్నో రోజుల నుంచి విరాట్ ను చూడాలని ఆశపడుతోంది. ప్రస్తుతం కోహ్లీ వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రెండో టెస్టు సందర్భంగా కోహ్లీని కలిసే అవకాశం ఆమెకు లభించింది. ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా తమ హోటల్ కు తిరిగి వెళ్లేందుకు బస్సు దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో జాషువా తల్లి కోహ్లీని కలిసింది. కోహ్లీని దగ్గరి నుంచి చూడగానే ఆమె ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. అతడిని ఆప్యాయంగా హత్తుకొని ముద్దుపెట్టుకుంది. కోహ్లీ కూడా ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కోహ్లీని కలవడం పట్ల జాషువా తల్లి సంతోషం వ్యక్తం చేసింది. ‘కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్. తను కూడా నాకు కొడుకులాంటి వాడు. కోహ్లీని చూసి జాషువా కూడా చాలా నేర్చుకోవాలని భావిస్తున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
Virat Kohli is once in a life time sportsperson.
The respect, he has earned over a decade, What a beautiful video. pic.twitter.com/bDhizasC6U
— Johns. (@CricCrazyJohns) July 22, 2023
The moment Joshua Da Silva's mother met Virat Kohli. She hugged and kissed Virat and got emotional. (Vimal Kumar YT).
– A beautiful moment! pic.twitter.com/Rn011L1ZXc
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
Also Read..
Virat Kohli 76th Ton | విరాట్ క్లాసిక్ సెంచరీ.. అనుష్క, సచిన్ ఇన్స్టా పోస్టు వైరల్
Anand Mahindra | హనీమూన్ లో చెస్ ఆడుతున్న ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
West Bengal | బెంగాల్ లో మణిపూర్ తరహా ఘటన.. మహిళల్ని అర్ధనగ్నంగా ఊరేగించి..