West Bengal | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ (West Bengal) లోనూ అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
మాల్డా (Malda) లోని పకువాహాట్ లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మహిళల్ని పట్టుకుని స్థానికులు చితకబాదారు. ఆపై అర్ధనగ్నంగా (Women Half Nake Parade) వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటన రెండు మూడు రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తాజాగా బయటకు వచ్చింది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే విషయం తెలిసిందన్నారు. బాధిత మహిళలు ఇద్దరూ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read..
No snakes no marriage | అల్లుళ్లకు కట్నంగా పాములు.. లేదంటే పెళ్లి క్యాన్సిల్
Rajamouli | కల్కి.. ఇంకా ఆ ఒక్క ప్రశ్న మిగిలి ఉందన్న జక్కన్న.. ఆశ్చర్యపోతున్న దర్శక నిర్మాతలు