No snakes no marriage | వివాహ సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అల్లుడికి కట్నంగా (dowry) బంగారమో, పొలమో, డబ్బులో, ఇళ్లో ఇవ్వడం మనం ఇప్పటి వరకూ చూశాం. కానీ, పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని ఇప్పటి వరకూ ఎవరైనా చూశారా..? మీరు విన్నది నిజమే. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని కొర్బా (Korba) ప్రాంతానికి చెందిన గిరిజన తెగ.. అల్లుళ్లకు పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని వందేళ్లుగా పాటిస్తోందంట.
సన్వారా తెగ (Sanwara tribe)కు చెందిన వారు పెళ్లిళ్ల సమయంలో వధువు తరఫు నుంచి వరుడికి తొమ్మిది రకాల జాతులకు చెందిన పాములను కట్నంగా ఇచ్చుకుంటున్నారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోరంట. ఈ ఆచారానికి సంబంధించి ఆ తెగకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తమ పూర్వీకులు 60 పాములను ఇచ్చే వారని తెలిపారు. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. పాములను కట్నంగా ఇవ్వడానికి ఓ కారణం ఉందట. పాములను ఆడించడమే ఆ గిరిజనులకు జీవనాధారం. అందుకే వరకట్నంగా పాములను ఇస్తుంటారని తెలిసింది.
Also Read..
Manipur violence | మణిపూర్ అమానవీయ ఘటన.. ఐదో నిందితుడి అరెస్ట్
Manipur Violence | మణిపూర్ హింస.. మరో వీడియో వైరల్.. 6 వేల కేసులు నమోదు..!