గురువారం 03 డిసెంబర్ 2020
Sports - May 18, 2020 , 16:17:37

గొంతు కోస్తానన్నాడు.. అందుకే సిక్స్‌లు కొట్టి చూపించా

గొంతు కోస్తానన్నాడు.. అందుకే సిక్స్‌లు కొట్టి చూపించా

ముంబై: ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ నన్ను రెచ్చగొట్టడం వల్లనే నేను ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి చూపించానని గుర్తుకు చేసుకొన్నాడు డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌. 2007లో టీ20 ప్రపంచ కప్‌ సందర్భంగా వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంత కసితో ఆరు సిక్స్‌లు కొట్టడానికి ఎలా ప్రేరేపితమైనది, ఆ ఓవర్‌కు ముందు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో వాదనను యువరాజ్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఇంగ్లండ్‌ మాజీ  కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో గుర్తుచేసుకొన్నారు.

'అసలు ఆరోజు ఏంజరిగిందంటే.. ఫ్లింటాప్‌ వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. వాటిలో ఒకటి యార్కర్‌. ఆ రెండింటిని ఫోర్లుగా మలవడంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్‌ నావైపుగా నడుచుకొంటూ వస్తూ.. 'చెత్త షాట్స్‌' అంటూ అవహేళన చేశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోస్తా అంటూ సైగలు కూడా చేయడంతో నాకు చిర్రెత్తుకొచ్చి.. నా కోపాన్నంతా తర్వాతి ఓవర్‌లో స్టువర్ట్‌బ్రాడ్‌ బాల్స్‌పై చూపడంతో ఆరు బంతులు ఆరు సిక్స్‌లుగా వెళ్లాయి. అనంతరం ఫ్లింటాఫ్‌ వైపు చూశాను. అప్పడు నా కోపం చల్లారింది'.. అని చెప్పాడు యువరాజ్‌సింగ్‌. నిజానికి నా మైండ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాలన్ని ఆలోచన లేదని, ఫ్లింటాఫ్‌ పురిగొల్పడం వల్లనే కొత్త రికార్డు సాధించానన్నారు. అంతకుముందు నాబౌలింగ్‌లో మర్కనాస్‌ ఐదు సిక్సర్లు బాదాడు. అందుకని ఆతడ్ని కూడా చూశా అని చెప్పుకొచ్చారు యువరాజ్‌సింగ్‌.