ముంబై: మెగాటోర్నీ ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువపేసర్ హర్షిత్ రానా టీ20 ప్రపంచకప్‌నకు పూర్తిగా దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రానా పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది.
అయితే రానా స్థానంలో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్‌ను టీమ్ఇండియా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఒక ప్రకటనలో పేర్కొంది.