Tri Nation Series : వన్డే వరల్డ్ కప్ ముందు భారత మహిళల జట్టు ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో శ్రీలంక (Srilanka)తో తలపడనుంది. టాపార్డర్, మిడిలార్డర్ సమిష్టిగా రాణిస్తుండడం, బౌలర్లు చెలరేగుతుండడంతో టీమిండియాకు విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే.. చమరి ఆటపట్టు బృందాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. లీగ్ దశలో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలుపొందాయి. దాంతో, ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరుగబోయే బిగ్ ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుంది? ట్రోఫీని ముద్దాడేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
టీ20 వరల్డ్ కప్‌లో దారుణ ప్రదర్శన తర్వాత భారత జట్టు పుంజుకుంది. ముక్కోణపు సిరీస్‌లో సమిష్టిగా రాణిస్తూ శ్రీలంక, దక్షిణాఫ్రికాలకు చెక్ పెట్టింది. ఆరంభ పోరులో ఓపెనర్లు ప్రతీకా రావల్ అర్ధ శతకంతో రెచ్చిపోగా లంకపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది హర్మన్‌ప్రీత్ సేన. ఆ తర్వాత సఫారీలను 15 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
For anchoring the chase with an unbeaten 50, Pratika Rawal is the Player of the Match 👏
Scoreboard ▶️ https://t.co/cf4bWgyFWs#TeamIndia | #WomensTriNationSeries2025 | #SLvIND pic.twitter.com/JwKmPF3sPQ
— BCCI Women (@BCCIWomen) April 27, 2025
అయితే.. తదుపరి పోరులో శ్రీలంక 3 వికెట్లతో విజయం సాధించి భారత్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాను ఓడించిన ఇండియా.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో ఆతిథ్య లంకను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం 4:30 గంటలకు మ్యాచ్ షురూ కానుంది
నిరుడు ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఆధిపత్యానికి శ్రీలంక గండి కొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి షాకిస్తూ శ్రీలంక విజేతగా నిలిచింది. దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంక బౌలర్ల ధాటికి భారత్ 165 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో ఆదిలోనే వికెట్లు పడినా హర్షిత సమరవిక్రమ 69 అజేయంగా నిలిచి చిరస్మరణీయ విజయంతో ట్రోఫీ కలను సాకారం చేసింది.