Rains | హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న రెండు రోజులు కూడా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.