INDW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో కీలక మ్యాచ్‌లో భారత జట్టు (TeamIndia) పోరాడి ఓడింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా (Australia)కు బ్రేకులు వేయలేకపోయింది. భారీ ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ(20), స్మృతి మంధాన(6)లు విఫలమైనా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(54 నాటౌట్) ఆఖరి దాకా పోరాడింది. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ దీప్తి శర్మ(29)తో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపింది. అయితే.. ఆసీస్ బౌలర్లు పుంజుకొని ఆఖర్లో వరుసగా వికెట్లు తీశారు. దాంతో, టీమిండియాకు ఓటమి తప్పలేదు. 9 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా సెమీస్ బెర్తుకు మరింత చేరువైంది.
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఛేదనలో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరంభం అదిరినా ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో దంచికొడతారనుకుంటే ఓపెనర్లు షఫాలీ వర్మ(20), స్మృతి మంధాన(6)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, మరోసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), జెమీమా రోడ్రిగ్స్(16)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, మేగన్ షట్ వేసిన ఆరో ఓవర్లో జెమీమా భారీ షాట్ ఆడి గార్డ్నర్ చేతికి చిక్కింది. దాంతో, 47 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ పడింది.
Yet another heartbreak for Harmanpreet Kaur and India 💔
FOLLOW: https://t.co/tPPpAyLqTy | #T20WorldCup pic.twitter.com/gILwV5ST05
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2024
ఆ దశలో దీప్తి శర్మ(29), కౌర్‌లు అద్భుతంగా ఆడి నాలుగో వికెట్‌కు 63 పరుగులు భాగస్వామ్యంతో ఆశలు రేపారు. అయితే.. మొలినెక్స్ ఈ జోడీని విడదీసింది. ఆ తర్వాతి ఓవర్లో రీచా ఘోష్()ను ఫొబే లిచ్‌ఫీల్డ్ మెరుపు త్రోతో రనౌట్ చేసింది. అయినా సరే.. హర్మన్‌ప్రీత్ పట్టు వదల్లేదు. 18వ ఓవర్లో రెండు బౌండరీలు.. 19వ ఓవర్లో పూజా వస్త్రాకర్(), ఆమె చెరొక ఫోర్‌తో సమీకరణాలు మార్చేశారు. ఆఖరి ఓవర్లో భారత జట్టు విజయానికి 14 పరుగులు అసవరం కాగా.. అనాబెల్ సథర్లాండ్ బంతి అందుకుంది. తొలి బంతికి కౌర్ సింగిల్ తీసింది. అయితే.. రెండో బంతికి పూజా బౌల్డ్ అవ్వగా.. అరుంధతి రెడ్డి రనౌట్‌గా వెనుదిరింగిగింది. ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ రనౌట్..
టాస్ గెలిచిన విధ్వంసక బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్‌ను 150 లోపే కట్టడి చేసింది. పవర్ ప్లేలోనే రేణుకా సింగ్(224) విజృంభణతో ఒత్తిడిలో పడిన కంగారూ జట్టు.. వందకొట్టడం కష్టమే అనిపించింది. కానీ.. భారత బౌలర్ల లయను దెబ్బతీస్తూ గ్రేస్ హ్యారిస్(40), తహ్లియా మెక్‌గ్రాత్(32)లు బౌండరీలు సాదించారు.
That was… exhilarating 😅
A rollercoaster of an innings ends on 151 – who’s winning this? 👀
FOLLOW: https://t.co/tPPpAyKT40 | #T20WorldCup pic.twitter.com/BAwTFgB1Lu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2024
హ్యారిస్ జతగా ఎలీసా పెర్రీ(32)లు దూకుడుగా ఆడింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును ఉరికించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దీప్తి శర్మ(228) డగౌట్ పంపి ఆసీస్ జోరుకు కళ్లెం వేసింది. బౌలింగ్ ఒక్కటే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన టీమిండియా కంగారూలను నిలువరించగలిగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రాధా యాదవ్ రెండు సూపర్ క్యాచ్‌లతో మెరిసింది.