World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది. ఎలంబా ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన హర్మన్ బంతిని అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయింది. దీప్తి శర్మ(37 నాటౌట్)తో కలిసి జట్టు స్కోర్ 200 దాటించిన కౌర్ భారీ స్కోర్ చేయకుండానే వెనుదిరిగింది. 223 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జట్టు స్కోర్ 300 దాటించే బాధ్యత దీప్తితో పాటు అమన్‌జోత్ కౌర్), రీచా ఘోష్లపైనే ఉంది. 40 ఓవర్లకు స్కోర్.. 229-4.
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో భారత జట్టుకు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు షఫాలీ వర్మ(87), స్మృతి మంధాన(45). సఫారీ ప్రధాన పేసర్ మరిజానే కాప్ తొలి ఓవర్లో
ఒక్క పరుగు రాకున్నా.. రెండో ఓవర్లోనే ఖాకాకు షఫాలీ బౌండరీతో స్వాగతం పలికింది. ఇక నాలుగో ఓవర్లో కాప్‌ను బెంబేలెత్తిస్తూ వరుసగా రెండు ఫోర్లు కొట్టింది లేడీ సెహ్వాగ్. ఖాక వేసిన ఆరో ఓవర్లో మంధాన రెండు వరుస బౌండరీలతో స్కోర్ 40 దాటించింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిధాలీ రాజ్ రికార్డును బ్రేక్ చేసింది మంధాన. 2017 వరల్డ్ కప్‌లో 409 పరుగులతో మాజీ కెప్టెన్ నెలకొల్పిన రికార్డును దాటేసింది.
#TeamIndia hit the 2⃣0⃣0⃣-run mark 👍
Captain Harmanpreet Kaur and Deepti Sharma going along nicely 👌
Updates ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final | @ImHarmanpreet | @Deepti_Sharma06 pic.twitter.com/dAtOoaINwl
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
పవర్ ప్లేలో 64 రన్స్‌తో గట్టి పునాది వేసిన ఈ జోడీ.. సెంచరీ భాగస్వామ్యంతో సఫారీలను విసిగించింది. ప్రధాన పేసర్లు విఫలమైన వేళ బంతి అందుకున్న ట్రయాన్.. మంధానను ఔట్ చేసి తొలి బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఖాక వరుస ఓవర్లలో షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్(24)ను ఔట్ చేసి.. ఒత్తిడి పెంచింది. 5 పరుగుల తేఆతో రెండు కీలక వికెట్లు పడిన వేళ దీప్తి శర్మ(37 నాటౌట్)తో కలిసి హర్మన్‌ప్రీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాలనుకుంది. కానీ.. ఎలంబా ఓవర్లో తను అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్ అయింది.