ముంబై: స్వదేశం వేదికగా శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. లంకతో పొట్టి సిరీస్ కోసం సీనియర్లు రోహిత్‌శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను తప్పించిన సెలెక్షన్ కమిటీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. టీ20ల్లో తనదైన శైలిలో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికకాగా, శివమ్ మావి, ముకేశ్ కుమార్‌కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న షమీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముఖేశ్ కుమార్.