Hardhik Pandya : పొట్టి ప్రపంచ కప్ హీరో, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) పుత్రోత్సాహంలో మునిగిపోయాడు. ఎందుకో తెలుసా..? దాదాపు రెండు నెలల తర్వాత కుమారుడు అగస్త్య(Agastya)ను కలిశాడు. నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic)తో విడాకుల తర్వాత పాండ్యా తన వారుసుడు అగస్త్యతో మొదటిసారి విలువైన సమయం గడిపాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
రెండు నెలల తర్వాత కన్నకొడుకును చూసిన పాండ్యా సంబురానికి హద్దే లేకుండా పోయింది. మురిపెంగా అగస్త్యను ఎత్తుకున్న పాండ్యా అతడిని ఆడిస్తూ తాను కూడా ఓ పిల్లాడై పోయాడు. అగస్త్యను ఎత్తుకొని మనసారా నవ్వుతూ తండ్రితనాన్ని ఆస్వాదించాడు.
Hardik Pandya met his son Agastya and the happiness & Joy on Hardik’s face. 🥹
– PURE WHOLESOME VIDEO..!!!! ❤️ pic.twitter.com/IGiEdrMqFS
— Tanuj Singh (@ImTanujSingh) September 22, 2024
ఈ ఏడాది జూలైలో హార్దిక్, నటాషాలు విడాకులు తీసుకున్నారు. అయితే.. విడిపోవడానికి ఫలానా కారణం అంటూ ఏమీ చెప్పకుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అలా నాలుగేండ్ల బంధాన్ని అర్థాంతరంగా ముగించారు. ఆ వెంటనే నటాషా కుమారుడు అగస్త్యను తీసుకొని తన స్వదేశం అయిన సెర్బియాకు వెళ్లింది. దాదాపు రెండు నెలల తర్వాత నటాషా మళ్లీ భారత్‌కు వచ్చింది. ముంబైలో బాయ్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
శ్రీలంక పర్యటనలో పెద్దగా రాణించని పాండ్యా ఇక టెస్టుల్లో పునరాగమనంపై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ స్క్వాడ్‌కు ఎంపికవ్వక పోవడంతో అతడు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. 2018లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన అతడు మళ్లీ తెలుపు జెర్సీ వేసుకోవాలనే కసితో ఉన్నాడు.
అందులో భాగంగానే ఈ ఆల్‌రౌండర్ బరోడా(Baroda) జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. తాజాగా అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. 2018లో బరోడాకు ఆడిన పాండ్యా దాదాపు ఐదేండ్ల విరామం తర్వాత మళ్లీ ఆ జట్టుతో కలుస్తాడని సమాచారం.