Mallanna temple | మల్లన్న దర్శనం.. భక్తుల పరవశం
Mallanna temple | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (Mallanna temple)వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన శివ నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది.
చేర్యాల, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (Mallanna temple)వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన శివ నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. స్వామి వారి ఉత్సవాలు ముగిసినప్పటికి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కొమురవెల్లి క్షేత్రానికి 15వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీశ తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్బాస్ హౌస్లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

