BCCI : చెపాక్ టెస్టులో తొలి రోజు నుంచే పట్టుబిగించిన టీమిండియా నాలుగో రోజే మ్యాచ్ ముగించింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అదే ఊపులో సెప్టెంబర్ 27న జరుగబోయే రెండో టెస్టులో కూడా విజయంపై రోహిత్ సేన కన్నేసింది.
అయితే.. కాన్పూర్ వేదికకానున్న ఈ టెస్టులో టీమిండియా ఏ మార్పులు చేయడం లేదు. తొలి టెస్టుకు ఎంపిక చేసిన బృందాన్ని కొనసాగించాలని సెలెక్టర్లు భావించారు. దాంతో, దులీప్ ట్రోఫీలో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు నిరీక్షణ తప్పలేదు.
🚨 NEWS 🚨
India retain same squad for 2nd Test against Bangladesh.
More Details 🔽 #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBankhttps://t.co/2bLf4v0DRu
— BCCI (@BCCI) September 22, 2024
టీమిండియా స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
సుదీర్ఘ విరామం తర్వాత.. అది కూడా స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్ట అద్భుత విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో రవిచంద్రన్ అశ్విన్(113, 6/88), రవీంద్ర జడేజా(86, 3/58)ల ఆల్రౌండ్ షోతో అదరగొట్టగా.. యువకెరటాలు శుభ్మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109)లు శతకాలతో విజృంభించారు. 515 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ రెండు సెషన్లలోనే కుప్పకూలింది.
Victory by 2⃣8⃣0⃣ runs in the 1st Test in Chennai 🙌#TeamIndia take a 1⃣-0⃣ lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/wVzxMf0TtV
— BCCI (@BCCI) September 22, 2024
శతక వీరుడు అశ్విన్ ధాటికి నిలువలేక పర్యాటక బ్యాటర్లు చేతులెత్తేశారు. జడేజా కూడా ఓ చేయి వేయడంతో బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(82) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో చిరస్మరణీయ సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగిన అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
A game-changing TON 💯 & 6⃣ Wickets! 👌 👌
For his brilliant all-round show on his home ground, R Ashwin bags the Player of the Match award 👏 👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #TeamIndia | #INDvBAN | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/Nj2yeCzkm8
— BCCI (@BCCI) September 22, 2024