Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మొగించింది ఈ పాట. ఇప్పటికే ఈ పాటకు కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్ సెలబ్రిటీలు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు టాలీవుడ్ భామ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేసింది.
రీసెంట్గా ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మృణాల్ ఠాకూర్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేసింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ కల్కి సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించిన ఈ భామ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలతో పాటు తుమ్ హి హో సినిమాలతో ఈ భామ బిజీగా గడుపుతుంది.
Mrunal dancing to Kurchi Madathapetti – this video made my day 🥹💥@mrunal0801 😻❤️ #MaheshBabu #MrunalThakur #GunturKaaram #SSMB29pic.twitter.com/yuiwOxxBcw
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) September 22, 2024
Also Read..