అమరావతి : వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్త (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారిలో కల్తి నెయ్యిని వాడారంటూ బీజేవైఎం(BJYM) కు చెందిన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli) లోని జగన్ ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గత నాలుగురోజులుగా ఈ అంశంపై వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ధార్మిక సంఘాలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, తదితర సంఘాలు స్పందించి కల్తీకి పాల్పడ్డ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.