Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో మూవీ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.