Harbhajan Singh : భారత జట్టు త్వరలోనే వెస్టిండీస్(Westindies) పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే బీసీసీఐ(BCCI) షెడ్యూల్ విడుదల చేసింది. రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. విండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియా బృందాన్ని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దాంతో, కరీబియన్ పర్యటనలో కుర్రాళ్లను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) అన్నాడు. సీనియర్లు ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడారని, ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో అదరగొట్టిన కుర్రాళ్లను విండీస్ టూర్‌కు ఎంపిక చేయాలని ఈమాజీ ఆఫ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.
‘ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్(Axar Patel), ఇద్దరు స్పిన్నర్లుగా రవిబిష్ణోయ్(Ravi Bishnoi), యజువేంద్ర చాహల్‌ను తీసుకోవాలి. ఐపీఎల్లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌కు చోటివ్వాలి. ఓపెనర్‌గా ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్‌ను ఎంపిక చేయాలి. మూడో ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉండనే ఉన్నాడు’ అని హర్భజన్ వెల్లడించాడు.
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12 – 16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20Is
Here’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023