Lionel Messi: అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఆట గురించి తెలిసిందే. మైదానంలో చిరుతలా కదిలే అతను ప్రత్యర్థులను బోల్తా కొట్టించి గోల్ సాధించడంలో దిట్ట. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్ తన మార్క్ గోల్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు మరోసారి మ్యాజిక్ చేశాడు. కేవలం రెండు నిమిషాల్లోనే గోల్ కొట్టి అభిమానులను షాక్‌కు గురి చేశాడు.
చైనాలోని బీజింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ ఆట మొదలైన రెండు నిమిషాలకే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, ఆస్ట్రేలియా గోల్ కీపర్ మ్యాట్ రియాన్(Matt Ryan) అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
LEO MESSI. WHAT A GOAL!
INSIDE TWO MINUTES 🇦🇷🐐 pic.twitter.com/etyJibEwCc
— Sara 🦋 (@SaraFCBi) June 15, 2023
వరల్డ్ కప్ హీరో మెస్సీని చూసేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలోఅభిమానులువచ్చారు. వాళ్లలో చాలామంది మెస్సీ జెర్సీలు ధరించారు. మరికొందరు అర్జెంటీనా జెండాలు పట్టుకొని ఈలలు, కేకలు వేస్తూ మెస్సీకి మద్దతు తెలిపారు. ఈమధ్యే ఈ అర్జెంటీనా కెప్టెన్ పీఎస్జీ(PSG) క్లబ్‌ను వీడిన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్లో అతను అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు ఆడనున్నాడు. ఈ క్లబ్ సహ యజమాని ఎవరో తెలుసా..? ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్(David Beckham). ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన మెస్సీ నిరుడు తన వరల్డ్ కప్ ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు. రెండోసారి అర్జెంటీనాను ఫైనల్ చేర్చిన అతను ఫ్రాన్స్‌పై అదరగొట్టాడు. రెండు గోల్స్ కొట్టి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఉత్కంఠ రేపిన షూటౌట్లో మెస్సీ బృందం 4-2తో ఫ్రాన్స్‌పై గెలిచి విశ్వ విజేతగా అవతరించింది.