IND vs BAN 1st T20 : టీ20 వరల్డ్ కప్ విజేతగా స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ గెలుపొందిన భారత్ (Team India) పొట్టి సిరీస్‌పై గురి పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ స్టేడియంలో అక్టోబర్ 6న జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఢీ కొట్టనుంది. శ్రీలంక పర్యటనలో పొట్టి కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే గ్వాలియర్ చేరుకున్న భారత్, బంగ్లా క్రికెటర్లు నెట్స్ ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్నారు.
అయితే.. ఆ రోజు ‘గ్వాలియర్ బంద్’కు హిందూ మహా సభ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ రద్దు చేయాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన గ్వాలియర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్టేడియం పరిసరాల్లో నిషేధాజ్ఞులు విధించారు. స్టేడియం దగ్గర ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
Gearing 🆙 in Gwalior with radiant rhythm and full flow 👌👌 #TeamIndia hone their fielding skills ahead of the #INDvBAN T20I series opener 🙌@IDFCFIRSTBank pic.twitter.com/RjbUb7scXe
— BCCI (@BCCI) October 4, 2024
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ రద్దు చేయాలని గ్వాలియర్‌లోని హిందూ మహా సభ ఆదివారం అక్టోబర్ 6న బంద్‌కు పిలుపునిచ్చింది. నెల క్రింత బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసలో వందలాది మంది హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. మైనార్టీలు అయిన హిందువులను పొట్టన బెట్టుకున్న దేశపు జట్టుతో క్రికెట్ ఆడడం ఏంటీ? బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ రద్దు చేయాల్సిందే అంటూ.. ఇప్పటికే ఆ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
ఇక ఆదివారం బంద్ నేపథ్యంలో పోలీసులు స్టేడియం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. 163 సెక్షన్ ప్రకారం స్టేడియం దరిదాపుల్లో ఎవరు నిరసన తెలియజేయడం లేదా ర్యాలీలు తీయడం వంటివి చేయకూడదని తెలిపారు. స్టేడియానికి 200 మీటర్ల దూరంలో కిరోసిన్, పెట్రోల్ వంటి పేలుడు పదార్ధాలు, కత్తులు, కటార్లు వంటి మారణాయుధాలతో ఎవరు పట్టుబడినా అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటన విడుదలు చేశారు. అంతేకాదు మ్యాచ్ రోజు స్టేడియం వద్ద దాదాపు 16,00 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.