AFG vs SA : తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన అఫ్గనిస్థాన్(Afghanistan) రెండో వన్డేల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(105) విధ్వంసక సెంచరీతో గట్టి పునాది వేశాడు. అనంతరం అజ్మతుల్లా ఓమర్జాయ్(86), రహ్మత్ షా(50)లు హాఫ్ సెంచరీలతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో అఫ్గనిస్థాన్ మూడొందలు కొట్టేసింది. నిర్ణీత ఓవర్లలో కాబూలీ జట్టు 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
షార్జా స్టేడియంలో అఫ్గనిస్థాన్ బ్యాటర్లు ఆకలిగొన్న పులుల్లా చెలరేగారు. సఫారీ బౌలర్లను ఊచకోత కోశారు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్జాబ్(105 : 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అయితే వీరవిహారం చేసి ఏడో శతకం నమోదు చేశాడు. గుర్బాజ్ విధ్వంసానికి నంద్రె బర్గర్ తెరదించినా అఫ్గన్ స్కోర్‌బోర్డు మాత్రం ఆగలేదు.
There’s a long way to go yet for Rahmanullah Gurbaz 📈 🇦🇫
🔗 https://t.co/XTeUQrBXMa | #AFGvSA pic.twitter.com/ElO9EMNJs3
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2024
ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(86), రహ్మత్ షా(50)లు ఇక తమ వంతు అన్నట్టు చెలరేగారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడడంతో సఫారీ బౌలర్లు నీరుగారిపోయారు. వీళ్లిద్దరూ దంచడంతో అఫ్గనిస్థాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు కొట్టింది.