T20 World Cup 2024 : తొలిసారి మహిళల ఆసియా కప్ చాంపియన్‌గా అవతరించిన శ్రీలంక(Srilanka) టీ20 వరల్డ్ కప్ వేటకు సిద్దమైంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పొట్టి కప్ అందుకోని లంక ఈసారి కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మెగా టోర్నికి సమయం దగ్గర పడడంతో లంక క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. దేశానికి మొదటి ఆసియా కప్ టైటిల్ సాధించిన చమరి ఆటపట్టు(Chamari Athapathuthu) ఈ ఐసీసీ టోర్నీలో మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
ఇక ఆసియాకప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నేలతో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ ఇనొకా రణవీర (Inoka Ranaweera)ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో చెలరేగిన 18 ఏండ్ల ఓపెనర్ విష్మీ గుణరత్నేకు సైతం వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కింది.
The Sri Lanka Cricket Selection Committee selected the below-given 15-member squad to take part in the ICC Women’s T20 World Cup, which will be held in the UAE from 3rd to 20th October 2024.
The Minister of Sports and Youth Affairs approved the squad. The team will leave for the… pic.twitter.com/juD9It5pF8
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 20, 2024
శ్రీలంక స్క్వాడ్ : చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నే, కవిష దిల్హరి, నీలాక్షి డిసిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచిని నిసాన్శల, ఉదేశిక ప్రభోదిని, ఇనోషి ఫెర్నాండో, అచినీ కలసురియా, ఇనోక రణవీర, శశినీ గిమ్హని, అమా కాంచనా, సుగంధికా కుమారి.
ట్రావెల్ రిజర్వ్ : కౌశిని నుథ్యంగన.
పొట్టి ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఒకటైన లంక గ్రూప్ ఏ లో ఉంది. ఇదే సమూహంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. ఆసియా కప్ విజేతలుగా వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న లంక అక్టోబర్ 3న పాక్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.