Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు వింటే చాలు ఎంతటి బ్యాటర్‌కైనా వణుకు పుడుతుంది. టన్నుల కొద్దీ పరుగులు సాధించిన క్రికెటర్లు సైతం అతడి బౌలింగ్‌లో ఆడేందుకు తటపటాయిస్తారు. వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో దిగ్గజాల రికార్డులు బుమ్రా బద్ధలు కొడుతున్నాడు. ఈతరం బౌలర్లలో అగ్రగణ్యుడైన బుమ్రా చెపాక్‌లో బంగ్లాదేశ్ నడ్డివిరిచి మరో మైలురాయిని అధిగమించాడు.
మూడు ఫార్మాట్లలో టీమిండియా బౌలింగ్ యూనిట్‌కు పెద్ద దిక్కు అయిన బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత పేసర్‌గా, పదో ఇండియా బౌలర్‌గా రికార్డు పుటల్లో నిలిచాడు. అయితే.. మ్యాచ్ అనంతరం జియో సినిమాతో మాట్లాడిన బుమ్రా తన బౌలింగ్ యాక్షన్ కాపీ కొట్టొద్దని పిల్లలకు సూచించాడు.
𝟒𝟎𝟎 𝐰𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 💥💥
A milestone to savour! @Jaspritbumrah93 has picked up his 400th wicket for #TeamIndia.
Hasan Mahmud is caught in the slips and Bangladesh are now 112-8.#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/HwzUaAMOBt
— BCCI (@BCCI) September 20, 2024
రెండో రోజు ఆట అనంతరం కామెంటేటర్లు మాట్లాడుతూ మీ బౌలింగ్ యాక్షన్ ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది అని అన్నారు. అందుకు బుమ్రా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘ఆ వీడియోలు చూసి ఎలా బదులివ్వాలో నాకు అర్ధం కావడం లేదు. నేను కూడా పిల్లాడిగా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్లు వీరాభిమానిని. టీవీల్లో వాళ్లను చూసి సాధన చేసేవాణ్ణి. అయితే.. ఈమధ్య కొందరు పిల్లలు నా బౌలింగ్ యాక్షన్ కాపీ కొడుతున్న వీడియోలు చూశాను. కానీ, నన్ను అనుకరించాలని వాళ్లకు నేను సూచించను. కొన్ని సందర్భాల్లో మనం ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.
Not only boys but Girls have also started Coping Jasprit Bumrah action
BCCI should mentor this Girl 🧒 pic.twitter.com/bbp7n8ecS5— ICT Fan (@Delphy06) August 17, 2024
అయితే.. మనకంటూ సొంత స్టయిల్‌ను అలవాటు చేసుకోవాలి. జట్టుకు అవసరమైన ప్రతిసారి వికెట్లు తీస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని బుమ్రా వెల్లడించాడు. అంతేకాదు ఒకప్పుడు దేశం తరఫున ఆడాలని కల కన్నానని, పార్టీవ్ పటేల్ (Parthiv Patel) నా జర్నీని దగ్గరగా గమనించాడని స్పీడ్‌స్టర్ తెలిపాడు. టీమిండియాకు ఆడినన్ని రోజులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా’ అని బుమ్రా అన్నాడు. చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై బుమ్రా నిప్పులు చెరిగాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన అతడు రెండో రోజు టీమిండియా పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించాడు.